పటాన్ చెరులో సీపీఐ(ఎం) భారీ బైక్ ర్యాలీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్ గెలుపును కాంక్షిస్తూ భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి.వి రాఘవులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్పొరేట్, రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళ..? కార్మిక, శ్రామిక ప్రజల కోసం పోరాడే వాళ్ళ..? ప్రజలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు. మన సమస్యలపై శాసనసభలో గలమెత్తే అవకాశం వచ్చింది.. సీపీఐ(ఎం) అభ్యర్థిని ఆదరించి.. ఆశీర్వదించండిని ఆయన కొరారు. కార్మికులకు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు.. వారి హక్కుల కోసం సమ్మెలు చేసినప్పుడు ఇక్కడి పాలకులు ఎవరి పక్షం నిలబడ్డారో ఆలోచన చేయలని యాజమాన్యాల మేలుకోరే పాలకులు కార్మికులకు ఆపద వస్తే ఎలా ముందుకు వస్తారు? అని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా నిలిచినా కార్మికులు, ప్రజల సౌకర్యాలు మెరుగుపరచలేని పాలకులు కాలుష్యం కొరలు చాచినా పాలకులు అప్రమత్తంగా లేకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇంటింటికి మంచినీరన్నారు కానీ ప్రతి ఇంట్లో ఆర్వో వాటర్ మిషన్లు దర్శనమిస్తున్నాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటే అన్నారు. గతంలో వారు చేసిన తప్పులను వీరు చూపిస్తున్నారు.. ఇప్పుడు వీళ్ళ తప్పులను వాళ్ళు చూపిస్తున్నారు. కార్మికులు శ్రామికుల పక్షాన నిలిచేది ఎల్లవేళలా ఎర్రజెండనే ధన, సేవా బలం మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన పార్టీల నాయకులు డబ్బులు నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి భవిష్యత్తును కాపాడుకోవాలి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కమ్యూనిస్టులు పోరాటాలకు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అండగా ఉంటాయి. కార్మికులు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లిఖార్జున్ కు ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కొరారు.

Spread the love