పొన్నం ప్రభాకర్‌ గెలుపులో సీపీఐ పాత్ర కీలకం

– పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్‌ గెలవడంలో సీపీఐ పాత్ర కీలకమని, పొన్నం ప్రభాకర్‌ గెలుపు కోసం సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు అహర్నిశలు కషి చేయడం వల్లే గెలిచారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంద పవన్‌ మాట్లాడాతూ హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌ గెలవడం ఆనందకరమన్నారు. ఆయనను గెలిపించిన హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.. హుస్నాబాద్‌ను మరింత అభివద్ధి చేసి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాడని, గౌరవేల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచిందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి సీపీఐగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమ వంతు పాత్ర కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శులు గడిపే మల్లేష్‌, నాగేల్లి లక్ష్మారెడ్డి, ముంజ గోపి, కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ, కొయ్యడ సజన్‌ కుమార్‌, యెడల వనేశ్‌, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యాద పద్మ, కౌన్సిల్‌ సభ్యులు కొయ్యడ కొమురయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్‌, ఎగ్గొజు సుదర్శన చారి, బొజ్జపురి రాజు, పొదిల కుమారస్వామి, నెలవేని స్వప్న, మాడిశెట్టి శ్రీధర్‌, గాంబిరపు మధు, బైరగొని శ్రీను, అక్బర్‌, పుదరి రఘుపతి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love