– అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
– సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంటేశ్వర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన ఉన్నందున నిజామాబాదులో సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తూ అదుపులోకి తీసుకోవటం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శిని ఇంటి ముందు అరెస్టు చేసి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆదివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా పోలీసుల వైఖరిని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాంటప్పుడు ఇలాంటి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో ఏందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదికాకుండా అరెస్టులో పర్వంతో ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎందుకంటే, జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని మూడవ టౌన్ పోలీసులు ఉదయమే తమ ఇంటికి వచ్చి ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అరెస్టు చేసిన వారందరినీ షరతుగా విడుదల చేయాలని లేదంటే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.