సీఐడీ అధికారులకు సీపీఆర్‌ శిక్షణ

–  కిమ్స్‌లో ఒకరోజు ట్రైనింగ్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : గుండె నొప్పికి గురైన వ్యక్తులకు సీపీఆర్‌ ప్రథమ చికిత్సను చేయటం ద్వారా రక్షించే వైద్య విధానంపై 150 మంది సీఐడీ అధికారులు, సిబ్బందికి కిమ్స్‌ ఆస్పత్రిలో శనివారం ఒక రోజు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో ఎదురవుతున్న ఒడిదుడుకుల కారణంగా అనేక మంది గుండె నొప్పుల బారిన పడుతున్నారనీ, వారికి వెంటనే సీపీఆర్‌ను నిర్వహించటం వలన మృత్యువు నుంచి బయట పడగలుగుతున్నారని అన్నారు. ముఖ్యంగా, వేగవంతమైన జీవన యానంలో చిన్న పిల్లలు మొదలుకొని యుక్త వయసులోనివారు కూడా గుండె పోటుకు గురికావడం ఆందోళనకరమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా గుండెపోటుకు గురైనవారికి సీపీఆర్‌ను నిర్వహించటం వలన వారి ప్రాణాలకు ముప్పు తప్పుతున్నదనీ, ఈ నేపథ్యంలోనే సీఐడీలోని అధికారులు, సిబ్బందికి సీపీఆర్‌ను నిర్వహించటంలో శిక్షణనిప్పించినట్టు ఆయన తెలిపారు.

Spread the love