పిచ్చి మొక్కలే ప్రమాద సూచికలు..!

– ఆదమరిస్తే అంతే సంగతులు
– నిద్రావస్థలో ఆర్ అండ్ బి అధికారులు
– ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానికులు
నవతెలంగాణ – రాయపర్తి
రోడ్డు మరమ్మతు పనులు చేపడుతూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే అధికారులు నిద్రావస్థ నుంచి తేరుకోకపోవడంతో రోడ్డుకు ప్రమాద స్థాయిలో ఏర్పడిన గుంత నుంచి వాహనదారులను కాపాడడానికి పిచ్చి మొక్కలే ప్రమాద సూచికలుగా నిలుస్తున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రం నుండి అంబేద్కర్ కాలనీ, కొత్త రాయపర్తి, మహబూబ్ నగర్, రాగన్న గూడెం, పెర్కవేడు గ్రామాల గుండా నెక్కొండ, మహబూబాద్ కు వెళ్లే వాహనదారులు నిత్యం ఇదే రోడ్డును ఉపయోగిస్తారు. ప్రతిక్షణం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుకు వైన్ షాప్ సమీపంలో గత కొంత కాలం క్రితం రోడ్డు బాక్స్ కల్వర్టు నిర్మించారు. కాల్వర్ట్ పై ప్రమాద స్థాయిలో గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. స్థానికులు, స్థానిక అధికారులు సంబంధిత అధికారులు ఆర్ అండ్ బి అధికారులకు తెలిపిన స్పందించకపోవడం శోచనీయం. రోడ్డు మధ్యలో గుంత ఏర్పడిన తీరు చూసి వాహనదారులు ప్రమాదానికి గురికాకుండా స్థానికులు గుంతపై  పిచ్చి మొక్కలు పెట్టి ప్రమాదాలను నివారిస్తున్నారు. లక్షల్లో ప్రజాధనాన్ని జీతం రూపకంగా తీసుకుంటున్న అధికారులు విధులను నిర్వర్తించకపోవడం సిగ్గుచేటు అని ప్రజలు దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొద్దు నిద్రను వీడి రోడ్డు మరమత్తు పనులు చేపట్టి ప్రమాద స్థాయిలో ఏర్పడిన గుంతను పుడ్చాలని ప్రజానీకం కోరుతున్నారు.

Spread the love