నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మొసలి పిల్లల కలకలం సృష్టించింది. నాలాలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లను చూసి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్–చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది. అయితే, బుధవారం సాయత్రం భారీ వర్షం కురిసింది. వరదకు బల్కాపూర్ నాలాలో ఉధృతి పెరగడంతో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, నాలాలో ఒక్కసారిగా మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.