తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ- తిరుపతి: శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Spread the love