తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 75,875 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు 300 దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్ట్‌ కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

Spread the love