సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించే కేసీఆర్ కు మరొకసారి పట్టం కట్టండి

– నూతన మండల సంబరాల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ప్రజలకు పిలుపు,
నవతెలంగాణ –  మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి పట్టం కట్టండి అంటూ నూతన మండల దొంగ్లి ప్రజలకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గం లో నూతనంగా ఏర్పర్చిన డోంగ్లి మండలాన్ని నూతన మండల సంబరాలు శనివారం నాడు నిర్వహించారు. ఈ సంబరాల కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నాడు డోంగ్లి నూతన మండల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలు గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందించే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరొక్కసారి అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని దొంగిలి మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో దొంగలి సింగిల్ విండో చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ ఉమ్మడి మద్నూర్ మండల జెడ్పిటిసి సభ్యురాలు అనిత స్థానిక డోంగ్లి సర్పంచ్ మాధవి శశాంక్ పాటిల్ మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ దిగంబర్ పాటిల్ డోంగ్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ డోంగ్లి మండల తాసిల్దార్ క్రాంతి కుమార్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మండల ప్రజలు పాల్గొన్నారు.

Spread the love