నవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి మండలం జమ్మంకోట తండాకు చెందిన రమావత్ లక్ష్యానాయక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ గా దేశ రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు. చెన్నై శిక్షణా కేంద్రంలో ఉత్తమ కమాండెడ్ గా కమాండెంట్ విజయ్ కుమార్ చేతుల మీదుగా బెస్ట్ ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కమాండెన్స్ అవార్డుతోపాటు సర్టిఫికెట్ అందుకున్న రమావత్ లక్ష్యానాయక్ సోమవారం అంబేద్కర్ జయంతి సందర్బంగా సొంత ఖర్చులతో జమ్మన కోట గ్రామ రహదారి పై చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆర్మీ జవాన్ మాట్లాడుతూ.. 40 డిగ్రీల ఏండ కారణంగా ఎటు చూసిన నీళ్లు లేకపోవడం వల్ల, కొత్త బ్రిడ్జి నుంచి జమ్మనకోట వెళ్ళే రహదారి కావడంతో గ్రామం వాళ్ళే గాక జమ్మన కోట,చింతలపాలెం, నాయకుని తండా, సపవత్ తండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని జమ్మనకోట వద్ద చలి వేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమావత్ పులియా, రమావత్ హరి కృష్ణ, తాతరావు,లక్ష్మి, రాంబాబు,బాలోజీ,బుజ్జి, చిట్టి, సిరి,తదితరులు పాల్గొన్నారు.