ప్రమాదాల నివారణకు హైబ్రీడ్‌ తాటిచెట్ల పెంపకం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌
– పొట్టి తాటి మొక్కలు నాటిన బోయినిపల్లి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
నవతెలంగాణ – రామడుగు: ప్రమాదాల నివారణకు హైబ్రీడ్‌ తాటిచెట్లు తాటిచెట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌ సూచించారు. ఈ మేరకు మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్‌తో కలిసి సోమవారం హైబ్రీడ్‌ పొట్టి తాటి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాటి పండ్ల నుండి పెక్టిన్‌ అనే పదార్థం తీయవచ్చని, మన దేశం ఏటా 5000 కోట్ల పెక్టిన్‌ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దీనిపై పరిశోధనలు ప్రోత్సహిస్తామని, తాటి పండ్ల నుండి, గేగుల నుండి పిండి, పశువుల దాణా తయారీపై పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. గౌడన్నలకు రూ.5లక్షల మరణ బీమా, రూ.3లక్షలతో ప్రమాదబీమాను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుం దన్నారు. తాటి కల్లు ఆరోగ్య ఔషదమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. కాగా గౌడన్నలు తాటికల్లు తాగాలని ఎమ్మెల్యేకు సూచించడంతో ఎమ్మెల్యే తాటికల్లు తాగి, తాటికల్లులో ఔషధంగా గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందని పేర్కొన్నారు. అనంతరం గోపాల రావుపేటలో రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్విండో చైర్మెన్‌ వీర్ల వెంకటేశ్వర రావు, ఎంపీటిసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడవెల్లి నరెందర్‌ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గంట్ల జితెందర్‌ రెడ్డి, నాయకులు, గంట్ల వెంకటరెడ్డి, మడ్డి శ్యాం, దాసరి రాజేందర్‌ రెడ్డి, పూడూరి మల్లేశం పాల్గొన్నారు.

Spread the love