కల్చరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుతో సాంస్కృ‌తిక విధానం

నవతెలంగాణ-కల్చరల్‌
రాష్ట్ర ప్రభుత్వానికి సాంస్కృ‌తిక విధానం లేనందున కళాకారులకు ప్రోత్సాహం లభించటం లేదని వివిధ రంగాల ప్ర ముఖులు అవేదన వెలి బుచ్చారు. వారు తెలుగు విశ్వ విద్యాలయం లోని సమావేశ మందిరం లో సమావేశమై కల్చరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు కార్పొరేషన్‌ ద్వారా జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ కళా ప్రక్రియల్లో పోటీలు నిర్వహించి విజేతలకు నగదు పురస్కారం బహుకరించాలని ప్రతి జిల్లా కేంద్రం లో కళా ప్రదర్శన మందిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.గతం లో మాదిరిగా సాంస్కతిక సంస్థ లకు కళాకారులకు గ్రాంట్స్‌ ఇవ్వాలని, కళా శాల స్థాయి వరకు యువతను కళా ప్రక్రియలో పాల్గొనే లా ప్రోత్సాహించాలనీ కోరారు. క్రీడా కారులకు విద్యారంగం ఉద్యోగాలలో కోటా కల్పించినట్లు గానే కళాకారులకు కల్పించాలని ముఖ్యం గా కార్పొరేషన్‌ కు బడ్జెట్‌ కేటాయించి చైర్మన్‌ ను సలహామండలి నీ నియమించాలని మరికొన్ని సూచనలతో కూడిన తీర్మానం చేశారు. ఈ సమావేశం లో రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాల కష్ణ కవి వడ్డేపల్లి కష్ణ మధు వాకిటి వేణుగానం కళాకారుడు నాగరాజు,గాయని మణి పాండురంగ ముతలిక్‌,కోట్ల అనిత, పీ.వీ.సాయి నాట్య గురువు మణాళిని కిన్నెర రఘురాం జయధీర్‌ తిరుమలరావు తదితరులు పాల్గొనగా ఇంద్రజాల కళాకారుడు వేణు సామల అధ్యక్షత వహించారు.

Spread the love