సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌
చింతపట్ల శ్రీ బీరప్ప, బొడ్రాయి ఉత్సవంలో సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-యాచారం
సమాజంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను మనమందరం గౌరవించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ కోరారు. సోమవారం యాచారం మండల పరిధిలోని చింతపట్లలో గత మూడు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన, శ్రీ బీరప్ప పండగ ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో సీపీఐ(ఎం) నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలతో చింతపట్లలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం సందడి కనిపించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బి మధుసూదన్‌ రెడ్డి, ఆలంపల్లి నరసింహ, డి జగదీష్‌, అంజయ్య, మల్లేష్‌, జంగయ్య, చందు నాయక్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love