ఆయుర్వేద వైద్యంతో వ్యాధులు నయం..

– ఇసామియ బజార్ కమిటీ హాల్ లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్ స్ సెంటర్
– మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్
నవతెలంగాణ- సుల్తాన్ బజార్
ఆయుర్వేద వైద్యంతో వ్యాధులు నయమవుతాయని ఇసామియా బజార్ ప్రభుత్వ ఆయుర్వేద పాలి క్లినిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం ఇసామియా బజార్ కమిటీ హాల్ లో గల ప్రభుత్వ ఆయుష్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ఆయుర్వేద క్లినిక్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయుర్వేద వైద్యంతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఈ మందులు తీసుకోవడం వల్ల ఇతర వ్యాధులు దరి చేరవని చెప్పారు. బీపీ, షుగర్, ఫైల్స్, కీళ్లవాతం లాంటి వ్యాధులకు మందులు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు రోగులను పరీక్షించి అవసరమయ్యే వారికి మందులను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. యోగా సెంటర్ ఉందన్నారు. ఆయుర్వేదంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Spread the love