నవతెలంగాణ- ఆర్మూర్: ఓటర్లను అన్ని విధాలుగా ప్రలోభాలకు గురిచేసి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను నయాను భయాను ఒప్పించి వారి మద్దతు సంపాదించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల ప్రలోభాలపై ముమ్మార ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని డబ్బులు అయినా చెల్లించేందుకు పార్టీలు వెనక్కి వెళ్లడం లేదు. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిశీలకులు మహిళా ఓటర్లకు, బీడీ కార్మికులకు, కుల సంఘాలకు గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఖరారైన అభ్యర్థుల పార్టీ నాయకులు ఇప్పటికే స్థానికంగా ఉన్న నేతలంతా ఆ దిశగా బీరసారాలు మొదలుపెట్టారు. ప్రలోభాలకు పార్టీలు తెరలేపడంతో సర్వర్త ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇతర ప్రాంతాల్లోని బంధువులకు, వ్యాపారులకు మిత్రులకు కూడా భారీగా నగదు పంపుతూ ఓట్లు వేయడానికి ఈనెల 30న గ్రామాలకు రావాలని ఫోన్ల ద్వారా సమాచారం పంపుతున్నారు. మరికొన్ని చోట్ల రహస్యంగా దాచిన మందును రాత్రి ప్రాంతాల్లో గ్రామాలకు తరలిస్తున్నారు .గ్రామస్థాయి నేతలకు, మండల స్థాయి నేతలకు , నియోజకవర్గ స్థాయి నేతలకు డబ్బులు చేతులు తడుపుతూ రేటు నిర్ణయించి డబ్బు పంపిణీ చేయడం జరుగుతుందని తెలుస్తోంది.