సైబర్ నేరాగాల పొట్ల అప్రమత్తంగా ఉండాలి

– సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కళాబృందాలు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : మండల కేంద్రంలోనీ  ప్రధాన కూడలి వద్ద పోలీసు కళాబృందం ఎస్సై కోన రెడ్డి పోలీస్ సిబ్బంది కలిసి మండల,పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు సైబర్‌ నేరా లపై  అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ సెల్‌ఫోన్లు,ఇంటర్నె ట్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. మహిళలు,పిల్లలే లక్ష్యంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతూ వివిధ రకాల వేధింపుల కు గురిచేస్తున్నారని వివరించారు.ఆన్‌లైన్లో ఎన్నో రకాల యాప్‌ల ద్వారా వివిధ షాపింగ్‌లు, ఉద్యోగాలు, లావాదేవీలు తదితర అవసరాల నిమిత్తం విరివిగా ఆన్‌ లైన్‌ సేవలను వినయోగించడం పెరిగిందన్నారు. దీన్ని ఆసరా చేసుకొని సైబర్‌ నేర స్థులు లోన్లు ఇస్తామని, తక్కువ ధరకు వస్తువులు, వాహనాలు ఇస్తామని చెప్పి డేటా సేకరించి బ్యాంకుల్లో ఉన్న నగదును కాజేసి తిరిగి వేధింపులకు గురిచేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ నేరాల బారిన పడకుండా పోలీస్‌ శాఖ సైబర్‌ కాంగ్రెస్‌, ఉమె న్‌ సేఫ్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యా వ్యవస్థల్లో ఆన్‌లైన్‌ భద్రత కల్పించడంతో పాటు సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు అవగాహన కల్పిస్తున్న ట్లు పేర్కొన్నారు.సైబర్‌ నేరాలు నియంత్రించడంలో ఉపాధ్యాయులు తమవంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కోనారెడ్డి కామారెడ్డి జిల్లా కళాబృందం పోలీస్ స్టేషన్ సిబ్బంది, కానిస్టేబుల్ సాయి హోంగార్డులు అంజి,సంజీవరెడ్డి,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love