అరేబియా సముద్రంలో తీవ్రంగా బిపొర్జాయ్‌ తుఫాను..

నవతెలంగాణ – వల్సాద్‌: ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్జాయ్‌ తుఫాను మరింత తీవ్రమైంది. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉన్నది. దాంతో మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం మీదుగా తీరంవైపు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇక దాయాది దేశం పాకిస్థాన్‌లో అయితే ఈ బిపొర్జాయ్‌ తుఫాను బీభత్సం సృస్టిస్తున్నది. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్జాయ్‌ తుఫాను ఉత్తరదిశగా ప్రయాణిస్తూ పాకిస్థాన్‌ తీరాన్ని తాకింది. ఈ తుఫాను ప్రభావంతో పాకిస్థాన్‌లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అక్కడ ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నది. తుఫాను ధాటికి పాకిస్థాన్‌లో ఇప్పటికే 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. అయితే, మన దేశంపై ఈ తుఫాను ప్రభావం అంతగా లేనప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాల్లో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా ఉంది.

Spread the love