కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డీ ఈ ఓ

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని మొకన్ పల్లి కస్తూర్బా పాఠశాలను జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందితో సైతం మాట్లాడి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాణి, సిబ్బంది ఉన్నారు.
Spread the love