నాన్న.. నిన్ను చాలా మిస్ అవుతున్నా : హీరో మహేష్

నవతెలంగాణ – హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు’ అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణను చూస్తుంటే మహేశ్‌లానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుదిశ్వాస విడిచారు.

Spread the love