నాన్న వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు..త్వరలోనే కోలుకుంటారు: కవిత

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అర్ధరాత్రి గాయపడిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ… కేసీఆర్ గారికి స్వల్ప గాయం అయిందని… ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలు, ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

Spread the love