నవతెలంగాణ- హైదరాబాద్: తమిళ హీరో విజయ్ తన చివరి సినిమాను ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో 69వ సినిమాను చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్ త్వరలోనే రానున్నట్లు పేర్కొంది. ఈ సినిమాకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘ది గోట్’ మూవీ తెలుగులో నిరాశపర్చింది.