– దళిత బంధు రెండో విడత కు తాత్కాలిక బ్రేక్.
– మంజూరి లో కీలకం కానున్న ఎం.పి.డి.ఒ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల ప్రక్రియ అమలుకు వచ్చిన నేపధ్యంలో దళిత బంధు రెండో విడత కు తాత్కాలిక బ్రేక్ బడింది.అమలు లో ఉన్న పథకం అయినప్పటికీ దీనికీ సంబంధించిన నిధులు కేటాయింపులు జరగలేదని విశ్వసనీయ సమాచారం. మొదటి విడతలో స్వయానా ఎమ్మెల్యే మంజూరి అధారిటీ గా ఉన్న నేపధ్యంలో జరిగిన అవకతవకలు సరిచేయడానికి గానూ ఈ సారి రెండో దఫా మంజూరి అధారిటీ మండల పరిషత్ అభివృద్ది అధికారికి బదలాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారిక భోగట్టా. ఇదిలా ఉండగా అశ్వారావుపేట నియోజక వర్గం నుండి దళిత బంధు మంజూరి జాబితా జిల్లా అధికారులకు అందలేదని తెలుస్తుంది.ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. అనంతరం ఆయా నియోజక వర్గాలు ఎమ్మెల్యే ఆదేశానుసారం అన్ని నియోజక వర్గాల నుండి జిల్లా ఉన్నతాధికారులకు అర్హుల జాబితా అందింది.కానీ అశ్వారావుపేట నియోజక వర్గం నుండి లబ్ధిదారుల జాబితా జిల్లా ఎస్.సీ కార్పోరేషన్ అధికారులకు అందలేదని విశ్వసనీయ సమాచారం. కారణం ఏమిటంటే ఈ నియోజక వర్గంలో పెత్తందారీ కులాల అధికార పోరు దళితులకు శాపంగా మారింది.ఈ కారణంగానే అర్హులు జాబితా కొలిక్కి రాలేదు.
కులాలు వారీగా దరఖాస్తులు | |
మాదిగ | 463 |
మాల | 350 |
ఉప కులాలు | 05 |
మొత్తం దరఖాస్తులు | 818 |
దళితులు జనాభా – 2011
పురుషులు | 3119 |
స్త్రీలు | 3112 |
మొత్తం | 6231 |
పురుషులు | 1826 |
స్త్రీలు | 1947 |
మొత్తం | 3773 |