దళిత వ్యక్తిని కాళ్లతో తన్ని కొట్టిన హోంగార్డులు..

నవతెలంగాణ – లక్నో: దళిత వ్యక్తిపై హోంగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిందకు తోసి కాళ్లతో తన్నారు. రైఫిల్‌ బట్‌తో కొట్టారు. ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని ఆ హోంగార్డులు అన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.  బహోరంగాల గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ జాతవ్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. దళిత వర్గానికి చెందిన అతడు భూమి దస్తావేజు కోసం తహసీల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న హోంగార్డులు వీరేంద్ర కుమార్‌ను కులం పేరుతో దూషించారు. ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని వ్యంగ్యంగా అన్నారు.

Spread the love