నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జాతీయ మాలల యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనుపాల కిరణ్ కు దళిత రత్న అవర్డ్ గ్రహితగ ప్రకటించారు. హైదరాబాదులో జరిగిన దళిత రత్న అవార్డు ను మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనుపాల కిరణ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత రత్న అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అనుపాల కిరణ్ మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మరియు డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు కమిటీ చెరుకు రామచందర్ కి ఉత్సవ కమిటీ వర్కింగ్ చైర్మన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమ సమాజం కోసం రాజ్యాంగ రక్షణ కోసం అంబేద్కర్ అడుగు జాడల్లో మీ అందరి ఆశీర్వాదంతో మరింత బలంగా ముందుకు సాగుతా అని తెలియజశారు.