నవతెలంగాణ – అశ్వారావుపేట
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష లో కెమిస్ట్రీ విభాగంలో స్థానిక వీకేడీవీఎస్ రాజు కళాశాల విద్యనభ్యసించిన దళిత విద్యార్ధిని జుంజునూరి ప్రవళిక కామన్ ర్యాంక్ 20 సాధించింది. అశ్వారావుపేట నియోజక వర్గం లోని దమ్మపేట మండల మందలపల్లి కి చెందిన విద్యార్ధిని తల్లిదండ్రులు రోజు వారీ కూలీ పేద కుటుంబీకులు.
ప్రవళిక ను ప్రిన్సిపాల్ శేషుబాబు,సిబ్బంది అభినందించారు.