దళిత మహిళపై వివస్త్రను చేసి.. కారంపొడితో దాడి

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఈసన్నా పల్లి లో ఆదివారం దళిత మహిళను వివస్త్రను చేసి కారంపొడి తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది. బాధితులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన సందాని నరేష్, అదే గ్రామానికి చెందిన నాగారపు సాధ్యతో 2021 డిసెంబర్ 24న ఇల్లరికం వివాహం జరిగింది. వారికి సంవత్సరం నాలుగు నెలల పాప ఉంది. ఇంటిలో తరుచుకో గొడవలు జరగడంతో, ఆటో డ్రైవర్ గా, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలానికి చెందిన దళిత మహిళ పరిచయమై, పరిచయం ప్రేమగా మారి, రామారెడ్డి మండలం కన్నాపూర్ ఆలయంలో వివాహం చేసుకొని, గత ఎనిమిది నెలల నుండి సహజీవనం గడుపుతున్నారు. ఇస్సన్నపల్లి లో ఉంటూ, నరేష్ స్థానిక రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. మహిళా కూలి పని చేస్తూ జీవిస్తున్నారు. నాలుగో తేదీ ఆదివారం రాత్రి 10 గంటలకు నరేష్ భార్యకు సంబంధించిన అత్త మామతో పాటు బంధువులు, ఉంటున్న రూమ్ లోకి చొరబడి మహిళ అని చూడకుండా ఇద్దరినీ వ్యవస్థలను చేసి కారం పొడి చల్లుకుంటూ దాడి చేశారని,  దాడి చేస్తూ వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంపారు.దాదాపు 11 గంటల సమయంలో మాచారెడ్డి మండలం అక్కాపూర్ కు తీసుకెళ్లి, రాత్రి రెండు గంటల వరకు నరేష్ ను కరెంటు స్తంభానికి కట్టేశారు. ఉదయం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించగా, సాయంత్రం ఏడు గంటల వరకు ఉన్న పోలీసులు కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చి ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో, తిరిగి ఇసనపల్లి వచ్చి బుధవారం స్థానిక ఎస్సైని సంప్రదించిన కాంప్రమైస్ కావాలని చెప్పడంతో, శుక్రవారం జిల్లా ఎస్పీని సంప్రదించడంతో హుటాహుటిన రాత్రి కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. దళిత మహిళపై దాడి చేయటం హే లేమైన చర్య అని, దళిత సంఘాలు, బాధితులు, ప్రజలు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Spread the love