వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. దళితులు ఆందోళన చేందోద్దు..

– సిర్నపల్లి నుంచి సందర్శించిన టి పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, దళితులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎళ్ళవేళల కాంగ్రెస్ పార్టీ తోడుగా, అండగా ఉంటుందని నిజామాబాద్ మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి అన్నారు.గురువారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామానికి పలువురు నాయకులతో కలిసి దళిత వాడాలో పర్యటించి గత నాలుగు రోజుల క్రితం దళిత బంధు రాలేదని ఆందోళన చెందిన విషయం తెలుసుకుని సందర్శించి జరిగిన వాటి వివరాలను దళితులను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించి మేమున్నామంటూ బరోసా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6గ్యారంటి పథకాలను అమలు చేస్తుందని, దళితులు నివాస గృహాలు కట్టుకుంటే 6లక్షల రూపాయలను అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో నిజామాబాద్  రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, డీసీసీ డెలిగేట్ వెంకట్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ సుధాకర్, మోపాల్ మండల మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ రవి ,జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గంగామణి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్, మైనార్టీ మండల అధ్యక్షులు జమీల్ పాషా, ముళ్ళంగి ఎంపీటీసీ నర్సయ్య,గన్నారం ఉప సర్పంచ్ బైరన్న ,బాడ్సి గంగారెడ్డి,సుధం శ్రీను,నిజామాబాదు రూరల్ ఎన్ ఎస్ యుఐ రూరల్ అధ్యక్షులు ఆశీష్ ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లవెల్లి రాజు, జెసిబి శ్రీను, ఎంపీ గంగన్న,సురేందర్, బద్దం రెడ్డీ,గుండ్ల రవి,వీరేందర్,శ్రీనివాస్, మానస, సాయిలు, విజయ్, పీర్ మహమ్మద్, హరి కృష్ణ , నర్సయ్య, శ్రీను తో పాటు  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love