పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా దామస్తాపూర్‌

– కనిపించని ట్రాక్టర్‌, పారిశుధ్య కార్మికులు
– ఎంపీడీవోకు గ్రామస్తులు ఫిర్యాదు
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని దామస్తాపూర్‌ గ్రామంలో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారిందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంగళవారం ఎంపీ డీవోకు ఫిర్యాదు చేశారు. మండలంలోని దామస్తాపూర్‌లో కొన్ని నెలలుగా పారిశుధ్యం పనులు చేపట్టడం లేదన్నారు. దీంతో మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి పి చ్చి మొక్కలు గడ్డి పెరగడంతో ప్రజలందరూ దోమల బారి న పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వాటర్‌ ట్యాం కులు శుభ్రం చేయకపోవడంతో నీళ్లలో క్రిములు వస్తున్నా యని, ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌, పారిశుధ్య కార్మికులు కనిపించడం లేదని తెలిపారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోయిందని గ్రామస్తులు తెలిపారు. వీధుల్లో వర్ష పు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. దోమల బెడద పెరిగిపోతుందని వెంటనే సంబం ధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Spread the love