దండకారణ్యంలో జిల్లా పోలీస్‌ బాస్‌

– నిర్భయంగా ఓటు వేయండి
– జిల్లా ఎస్పీ వినీత్‌ జీ
నవతెలంగాణ-చెర్ల
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ జి కోరారు. బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పోలీసు శాఖ అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పునర్గాటించారు. ప్రజా స్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండల వ్యాప్తంగా ఉన్న 35 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వాటన్నింటికీ పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అనంతరం మండల పరిధిలోని పూసుగుప్పలో మంగళవారం మావోయిస్టులు తగలబెట్టిన లారీ ఘటన స్థలానికి ద్విచక్ర వాహనంపై చేరుకొని రోడ్డు పైన సగం వరకు ఖాళీ బూడిదై ఉన్న లారీని తీపించేసి పూసుగుప్ప కు చెర్లకు రవాణా మార్గాన్ని పునర్ధరించడం తో పలువురు మనల్ని పొంది శభాష్‌ పోలీసింగ్‌ అని పించుకున్నారు.
పోలింగ్‌ కేంద్రం సందర్శన
చర్ల మండలంలోని ఉంజుపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. ఆయా కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఓఎస్డి సాయి మనోహర్‌, డి.ఎస్‌.పి సత్యనారాయణ, భద్రాచలం ఏ ఎస్పి పరితోష్‌ పంకజ్‌, చర్ల సిఐ బి .రాజగోపాల్‌, ప్రత్యేక పోలీస్‌ అధికారులు బి .అశోక్‌, రాజు వర్మ సిబ్బంది, సిఆర్పిఎఫ్‌ బలగాలు పాల్గొన్నారు.

Spread the love