– హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్.
– మారుమూల ప్రాంతానికి చెందిన దండు రమేష్ కు సేవారత్న పురస్కారం-2023″ తో ఘనంగా సత్కారం
నవతెలంగాణ; హైదరాబాద్,భూపాలపల్లి,మలహార్ రావు.
మారుమూల ప్రాంతానికి చెందినదండు రమేష్ సామాజిక సేవలో ప్రశంసానీయమని,అనుక్షణం ప్రజల పక్షానపోరాడుతున్నారు అని హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు,సర్వేజన సుఖినో భావంతు వారు 6వ వార్షికోత్సవం సందర్బంగా విశిష్ట పురస్కారాలలో సామాజిక సేవా రంగంలో దండు రమేష్ చేస్తున్న సేవను గుర్తించి హైద్రాబాద్ లోని సుందరయ్య కలనిలయం లో ఆదివారం రోజు “సేవారత్న పురస్కారం-2023” తో ఘనంగా సత్కరించారు,ఈసందర్బంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతూ వివిధ రంగాలలో నిష్ఠర్థులైనవారిని ఎంపికచేసి విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందన్నారు.అందులో భాగంగా దండు రమేష్ వారి ప్రాంతంలోని రైతులకు,దళితులకు చేస్తున్న సేవ అభినందనీయం అని వారు కొనియాడారు,దండు రమేష్ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించామని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల మండలి అధ్యక్షుడు మాందాడి కృష్ణ రెడ్డి,ప్రముఖ సంఖ్యా శాస్త్రనిపుణులు దేవాజ్ఞశర్మా,కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎస్ పి భారతి,కేంద్ర సెన్సార్ బోర్డ్ అసిస్టెంట్ జెనెరల్ మ్యానేజర్ పి. కృష్ణ అదిశేషు,సర్వేజనసుఖినో భవంతు స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యనారాయణ, సూర్యతేజ సుబ్రాన్త్,పలువురు సన్మానగ్రహితలు పాల్గొన్నారు