దాగా కోరు ప్రభుత్వంలో, దశాబ్ది ఉత్సవాలా?: మోహన్ రెడ్డి

నవ తెలంగాణ-రామారెడ్డి
ఇచ్చిన హామీలను, ప్రజా సంక్షేమాన్ని మరిచి, దగా కోరు ప్రభుత్వంలో దశాబ్ది ఉత్సవాలు ఏంటని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దళిత ముఖ్యమంత్రిని చేసినందుకా, రైతులకు రుణమాఫీ చేసినందుకా, ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూములు అందించినందుకా, యువతకు నిరుద్యోగ భృతి అమలు చేసినందుకా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుకా, రైతులకు ఉచిత ఎరువులు అందించినందుకా, ధరణి పోర్టర్ లో రైతుల భూములు అన్యకాంతం చేసినందుకా, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేస్తే, ధర్నా చౌకును ఎత్తివేసి, ఎక్కడికక్కడ నిరంకుశ పాలనలో పోలీసులతో అరెస్టు చేసి అణిచివేసినందుకా, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, పేపర్లు లీకేజీలు చేస్తున్నందుకా, కేజీ టు పీజీ అమలు చేసినందుకా, హైదరాబాదులో వరద బాధితులకు, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పదివేలు అందజేసినందుకా, బంగారు తెలంగాణ అని చెప్పి, కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా ఎదిగినందుకే, దొరల నిరంకుశ, నియంతృత్వ పాలనలో ప్రజలు దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా జరుపుకుందురా? ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి, ఇకనైనా స్వప్రయోజనాలు వదిలి ప్రజా సంక్షేమానికి, ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము.

Spread the love