నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ మట్టి మనిషి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరిగా నిలిచిన పద్య రచయిత,.తెలంగాణ వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సమాజం గర్వించదగ్గ కవి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ అన్నారు. బార్ హల్ లో దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కవి, సాహితీవేత్త నిజామాబాద్ జిల్లా జైలులో గడిపిన రోజుల మనకు చైతన్య దీపికలని అన్నారు. దాశరథి స్ఫూర్తి స్ఫూర్తి దాయకమని తెలిపారు. జయంతి వేడుకలో బార్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, ప్రధాన కార్యదర్శి భాగి చరణ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్ సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, మానిక్ రాజు, జగ న్ గౌడ్,పి.పి రవిరాజ్పాల్గొన్నారు.