నవతెలంగాణ – ముషీరాబాద్
జాతీయ వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్.వి చెన్నారావుకు దాసరి వంశీ ప్రతిభా పురస్కారం బహుకరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నగరంలోని ఫిలింనగర్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాలులో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ చేతుల మీదుగా ఆయన ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం చెన్నారావు బాగ్లింగంపల్లిలో మాట్లాడుతూ.. కర్ణాటక సంగీత అభివృద్ధికి భారతీయ కళలను ముందుకు తీసుకువెళ్లడంలో తన వంతుగా చేసిన కృషిని వంశీ సమస్త గుర్తించి ఈ అవార్డును అందజేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో కలలను పరిరక్షించేందుకు కృషి చేస్తానన్నారు.