– ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ కవి, రచయిత దాశరథి¸ కష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరిట ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘శ్రీ దాశరథి కష్ణమాచార్య అవార్డు-2023’ను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన అయాచితం నటేశ్వర శర్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డుతో పాటు రూ.1.01,116 నగదును, శాలువా, జ్ఞాపికను ఆయనకు ప్రదానం చేస్తారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీతకు వాటిని అందజేయనున్నారు. ఈ సందర్భంగా నటేశ్వరశర్మకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.