మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. ఐపీఎల్ లోనూ ఎస్ఆర్ హెచ్ (SRH)కి కెప్టెన్‌గా కప్ అందించారు.

Spread the love