నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ మండల పరిధిలోని కొత్తబాద్ గ్రామంలోని తండాలో సోమవారం జరిగిన జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, తాండా ప్రజలు పాల్గొన్నారు.