– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
– రూ.2.40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-పటాన్చెరు
వ్యవసాయాన్ని జీవనాధారంగా బతుకున్న రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) మరింత చొరవ కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరా రు. పటాన్చెరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో రూ.2కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న దుకాణాల సముదాయ నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులతో పాటు చిరు వ్యాపారులకు, సంస్థలకు వివిధ పథకాల ద్వారా రుణాలు అందించడంలో డీసీసీబీ ముందంజలో ఉందన్నారు. ఎప్పట ికప్పుడు బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయా లని కోరారు. త్వరితగతిన దుకా ణాల సముదాయం నిర్మాణాలను పూర్తి చేయాలని అధికా రులను కోరారు. బ్యాంకు అభివద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.