కరెంటు వైరుతాకి డీసీఎం దగ్ధం..

DCM burnt due to power failure..నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని జప్తిసదగోడు గ్రామంలో ప్రమాదవశాత్తు షార్ట్స్ సర్క్యూట్ తో గడ్డిలోడ్తో వెళ్తున్న డీసీఎం శనివారం దగ్ధమైంది. ఫైర్, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జప్తి సదగోడు గ్రామానికి చెందిన రైతు శ్యాంసుందర్ రెడ్డికి చెందిన వరి గడ్డిని అచ్చంపేట మండలంలోని ఫుల్జలా గ్రామ రైతు బస్వయ్య రూ.20 వేలకు కొనుగోలు చేశారు. ఆ గడ్డిని తరలించడానికి తాడూరు గ్రామానికి చెందిన కాకునూరి ఆంజనేయులు డీసీఎం ను అద్దెకు తీసుకొచ్చారు. గడ్డి లోడ్ చేసుకొని తిరుమలాపూర్ రోడ్డుపై వస్తున్న తరుణంలో రోడ్డుపై ఉన్న ఎల్టిలైన్ కు డిసిఎంపై ఎత్తులో ఉన్న గడ్డి కట్టలు తగిలి వైర్లు తెగిపడి మంటలు వ్యాపించి గడ్డి అంటుకొని ఫైర్ సిబ్బంది వచ్చేలోపే గడ్డి పూర్తిగా కాలిపోయింది. డీసీఎం క్యాబిన్ ముందు భాగం కూడా సగం కాలిపోయింది. మిగతా భాగాలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది పోలీసులు పంచనామా నిర్వహించి సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలిందని అంచనా వేశారు.
Spread the love