ఫుట్ పాత్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట రింగ్ రోడ్డు కు ఆనుకుని ఉన్న ఫుట్ పాత్ పక్కన గల పొదలలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం పడి ఉన్నది. యాదగిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇట్టి వ్యక్తి గళ్ళ చొక్కా, నల్ల పాయింట్, కుడి చేతికి కడెం ధరించి ఉన్నారు. మృతదేహం పక్కన బీర్ బాటిల్ ఉంది. శవం పూర్తిగా కుళ్ళి ఉండడంతో క్లూస్ టీమ్ ను పిలిపించి దర్యాప్తు చేస్తున్నాం. ఇట్టి వ్యక్తి మరణించి సుమారు 10-15 రోజులు కావచ్చు. ఇతని డైరీనీ పరిశీలించగా స్థానిక కన్స్ట్రక్షన్ మేస్త్రి ల ఫోన్ నెంబర్ లు ఉన్నాయి.
Spread the love