రైలు డోరు వద్ద నిలబడి ప్రయాణించిన బాలుడి దుర్మరణం

MMTSనవతెలంగాణ – హైదరాబాద్
ఎంఎంటీఎస్ రైల్లో డోర్ వద్ద నిలబడి ప్రయాణించిన ఓ 8వ తరగతి విద్యార్థికి కరెంటు స్తంభంతగిలి దుర్మరణం చెందిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోల్నాకాకు చెందిన శివకుమార్ కుమారుడు బంటి శనివారం బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు స్నేహితులతో కలిసి విద్యానగర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాడు. సంజీవయ్య పార్కు-జేమ్స్ స్ట్రీట్ స్టేషన్‌ల మార్గమధ్యలో రైలు వెళుతుండగా డోర్ వద్ద నిలబడ్డ బంటీకి విద్యుత్ స్తంభం తగిలింది. దీంతో, రైల్లోంచి కిందపడ్డ బంటీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Spread the love