నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొగులయ్య ఆదివారం తెలిపారు. 6 వ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్ రోడ్డు లో ఓ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వ్యక్తి వయస్సు సుమారు (45) సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఆరవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.