– జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ పర్శారాములు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక మండలంలోని పద్మనాభునిపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 9 వసంతాలు పూర్తై 10 ఏటాలో అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ,అమరుల త్యాగఫలంగానే సిద్దించిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్, ముక్కపల్లికనకయ్య, సెక్రటరీ స్వామి, టెక్నీకల్ అసిస్టెంట్ భాస్కర్, ఐకేపీ సిబ్బంది ,బీఆర్ఎస్ నాయకులు శేఖర్, పరమేష్, మహేందర్, యాదగిరి ,ప్రిన్సిపాల్ జానకి రామ్ తదితరులు ఉన్నారు