దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి

– ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నవతెలంగాణ-బెజ్జంకి
సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు,బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు.గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మండలంలోని ప్రజాప్రతినిధులు,అధికారులతో ఎమ్మెల్యే రసమయి సమీక్ష సమావేశం నిర్వహించారు.సుమారు నెల రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి దినం ఒక పండుగ వాతావరణాన్ని తలపించేల ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు.ఈ సమావేశంలో ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కనగండ్ల కవిత,ఎఎంసీ చైర్మన్ రాజయ్య,ఎంపీడీఓ దమ్మని రాము,నాయిభ్ తహసీల్దార్ పార్థసారథి,అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.