టీఆర్టీపై నిర్ణయం తీసుకోవాలి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మంత్రి వర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నేటి వరకు కూడా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 13500 ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్‌ వస్తుందని, ఆ లోపే టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, టెట్‌తో పాటు టీఆర్టీ షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు.

Spread the love