కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్‌ విడుదల చేయాలి

– మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ను దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పాలిత విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ చేశారు. శుక్రవారం హైదారాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 50 ఏండ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీలను మోసం చేసి ఓట్లను వేయించుకుందనీ, ఆ పార్టీ డిక్లరేషన్‌ ను ఆయా వర్గాలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ 1,006 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, దళిత బంధు తదితర అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు.

 

Spread the love