రాజకీయ లబ్ది కోసమే దీక్షలు, ధర్నాలు

 ఎవరెన్ని అడ్డంకులు సష్టించిన ఇర్వీన్‌ మండలం కావడం ఆగదు అందుగుల వాగుపై చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్లుగా దీక్షలు ఎందుకు చేయలేదు త్వరలోనే అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి ఇర్విన్‌ మండలం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కలుస్తుందని అసత్య ప్రచారం మానుకోవాలి మాజీ ఎంపీపీ జర్పుల జైపాల్‌ నాయక్‌
నవతెలంగాణ-మాడ్గుల
ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రజల వద్దకు ఏ సాకుతో వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని మాజీ ఎంపీపీ జర్పుల జైపాల్‌ నాయక్‌ ఎద్దేవా చేశారు. మండలంలోని అందుగుల గ్రామాన్ని నూతన ఇర్వీన్‌ మండలంలో కలుపుతున్న నేపథ్యంలో అందుగుల్ల వాగుపై బ్రిడ్జి చేపట్టాలని గ్రామంలో చేస్తున్న దీక్షను ఆయన తప్పు పట్టారు. మండల కేంద్రంలో ఆమనగలు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చిత్తాపురం నిరంజన్‌, ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన కొందరు నాయకులు దీక్షలు, ధర్నాలతో ఇర్విన్‌ మండలం కాకుండా పలు రకాల సాకులు చూపుతూ అడ్డంకులు సష్టి స్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై అంత సోయి ఉంటే ఇన్నాళ్లుగా ఎందుకు దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సష్టించిన ఇర్విన్‌ మండలం కావడం ఆగదని, ఒక్కొక్కటిగా అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ఇప్పటికే నర్సంపల్లి, పలుగు తండా, కుభ్యతండా, జరుపుల తండా గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని తండాలకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ రూ.16 కోట్లు మంజూరు చేశారనీ, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అదేవిధంగా అందుగుల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే చిత్తశుద్ధితో ఉన్నారని గతంలో అప్పటి కలెక్టర్‌ రఘునందన్‌రావును వాగు వద్దకు పిలిపించి సమస్య వివరించి, ఎస్టిమేషన్‌ వేయించినట్టు గుర్తుచేశారు. అందుగుల నుంచి ఇదంపల్లి, నర్సంపల్లి నుంచి గిరి కొత్తపల్లి, గిరి కొత్తపల్లి నుంచి శిరసనగండ్ల వాగులపై వంతెన నిర్మాణానికి మొత్తం రూ. 9 కోట్లతో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఎస్టిమేషన్‌ వేయించి ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపినట్టు జయపాల్‌ నాయక్‌ వివరించారు. అదేవిధంగా అన్న బోయిన్పల్లి కొత్త -బ్రాహ్మణపల్లి మధ్యలో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి ప్రాదనలు పంపినట్టు వివరించారు. ఇర్వీన్‌ మండలం ఏర్పడితే మండలాన్ని నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కలుపుతారని కొందరు ప్రజలను రెచ్చగొడుతూ చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్కపల్లి ఎస్‌ఎంసీ చైర్మన్‌ తోలు తిరుపతయ్య, నాయకులు సీత వెంకటేష్‌ ,సీత నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love