నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని ఓ ఇంట్లో నిన్న అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమైన ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దుర్గా నవరాత్రి సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపమే ఘోర విషాదానికి కారణమని అధికారులు గుర్తించారు. రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో దీపం వల్ల మంటలు చెలరేగాయి. అందులోని కిరాణా షాపులో 25 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ ఉంచారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిద్రలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.