సేవా గణపతికి  ఘనంగా దీపార్చన కార్యక్రమం 

నవతెలంగాణ కంఠేశ్వర్ : ఇందూరు యువత సేవా సంస్థ కార్యాలయంలో సేవా గణపతిని నెలకోల్పుకోని  సేవా గణపతి ఉత్సవ కమిటీ నిర్వహణలో 3వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తుంది . నవరాత్రుల్లో భాగంగా నేడు 9 వరోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా సేవా గణపతికి దీపార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోరికలు తీర్చే సేవా గణపతిగా స్వామి వారిని 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ఈ దీపార్చన కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love