కాంగ్రెస్‌ సీనియర్‌ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ చేరినందుకే ఓటమిపాలు

నవతెలంగాణ- బాలానగర్‌
కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ , పెద్దాయపల్లి ఎంపీటీసీ లక్ష్మయ్య , కేతిరెడ్డిపల్లి సర్పంచ్‌ రామ్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి సమక్షంలో చేరడంతో వాళ్ల కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసినట్టు తెలిసింది. వారు కార్యకర్తలకు , ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో కార్యకర్తలు నిరుత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీకే ఓటేసినట్లు తెలిసింది . బీఆర్‌ఎస్‌ పార్టీలో కొందరు సీనియర్‌ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దూరం పెట్టడతో కూడా ఆ సీనియర్‌ నాయకులు హస్తం గుర్తుకు ఓటేసినట్లు సమాచారం బాలానగర్‌ ఉమ్మడి మండలం మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రఘువీర్‌ రెడ్డి. టిఆర్‌ఎస్‌ లో గుర్తింపు లేదని కాంగ్రెస్‌ పార్టీలో మండల పరిధిలోని గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు సాధు వెంకట్రెడ్డి కాంగ్రెస్‌ లో పార్టీలో చేరి నాలుగు గ్రామాల ప్రజలను కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయించినట్లు తెలిసింది హిమాచపూర్‌ .పెద్ద రేవెల్లి .చిన్న రేవల మదంపల్లి తిరుమలగిరి. గూడజనంపేట గౌతపూర్‌ గ్రామాలకు చెందిన ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయించాలనితెలిపారు.

Spread the love