బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

– సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
నవతెలంగాణ – అచ్చంపేట
2024 పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద, కార్మిక కర్షక వ్యతిరేక బీజేపీ పార్టీని ఓడించాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడుతూ.. ఈ దేశ రైతాంగాన్ని దేశ ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని,  ఎన్నికలవేళ వికసిద్భారత్, సుస్థిర అభివృద్ధి, రామరాజ్యం స్థాపన వంటి నినాదాలతో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జిమ్మిక్కులు చేస్తుందన్నారు. దేశంలో కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేసిందని,  నిత్యవసర వస్తువుల ధరలు, ద్రవ్యాబలు నిరుద్యోగం వంటి కీలక సమస్యలను కార్మికులను ఇతర ప్రజానీకాని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆర్థిక సమస్యలతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఫెడరల్ స్ఫూర్తి రాజ్యాంగ హక్కులు లౌకిక తత్వం సామాజిక న్యాయం అంటే కీలక సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని, దేశ ఆర్థిక సార్వభౌమత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ఓటును బాధ్యత తోను ఇండియా కూటమికి వేసి గెలిపించాలని  కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసం చేస్తూ కార్పోరేట్ సంస్థలకు అందలం ఎక్కిస్తున్నారని రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ 109 రూట్ లను 150 యొక్క ప్రైవేటు రైళ్లకు అనుమతినిచ్చిందన్నారు. దేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కార్పోరేషన్లను విడగొట్టి రక్షణ రంగంలో ప్రైవేటీకరణ తెరలేపిందని  ఆవేదన వ్యక్తపరిచారు.  గత 15లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా సుమారు నాలుగు కోట్ల 90 లక్షల ఆదాయాన్ని సమకూర్చే పేరుతో ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసిందన్నారు.
జాతీయ బీమా సంస్థ ఎల్ఐసి వాటాలను ఐపీఓ ల పేరుతో అమ్మేందుకు తెగబడిందన్నారు. రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభం గడిచిన పదేళ్లలో దేశం 1,3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతాంగాని వ్యవసాయం నుండి దూరం చేసే కార్పొరేట్ వ్యవసాయని ప్రోత్సహించారని మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చిందని వారు అన్నారు. 2017లో మోడీ పార్లమెంట్లో చేసిన కనీస మద్దతు ధర హామీ పదేళ్లుగా అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేసిందని ఎరువులు విత్తనాలు పురుగు మందులను రైతులకు సకాలంలో అందించడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు. బీజేపీ పాలన సామాన్యులకు కష్టాలు తెచ్చిపెట్టిందని ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు హామీని ఇచ్చి మోసం చేసిందని , నిరుద్యోగత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని శ్రామికులు నిజవేతనాలు 20% తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తపరిచారు. బడా కార్పొరేట్ల వాస్తవ ఆదాయం గణనీయంగా 30% పెరిగిందని పేదల వాస్తవ ఆదాయం 11 శాతానికి పడిపోయిందని వారు అన్నారు. ప్రజలు ఈ దేశంలో రోజువారిగా ఎదుర్కొంటున్న సమస్యలకు విధానాలకు రాజకీయాలకు అవినాభా సంబంధం లే ఉంది కార్మిక వర్గ ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కావాలంటే బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఈ విధానాలను అమలు చేస్తున్న బీజేపీని ఓడించాలని ఈ పార్లమెంటు ఎన్నికల్లో సామాన్యులకు శతకోటీశ్వరులకు మధ్య పోటీగా జరుగుతున్నాయని కార్మిక వర్గానికి ప్రజలకు ఇది పరీక్ష సమయం రాష్ట్రంలోని కార్మికుల ఉద్యోగులు బీజేపీ మోసపూరిత వాగ్దానాలు ప్రలోభాలు భావోద్వేగాలకు గురికాకుండా చైతన్యం ప్రదర్శించాలని సీపీఐ(ఎం) పార్టీ కోరుతున్నదన్నారు. మతోన్మాదా కార్పొరేట్ బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించాలని ఇండియా టీం కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) పిలుపునిస్తున్నది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు,  బి ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు శంకర నాయక్, మల్లేష్,  నరసింహ, ఈశ్వర్, అశోక్,  శివ,  వర్మ , నాగరాజు  కాశన్న, కృష్ణయ్య,భాస్కర్,  దశరథం పార్టీ గ్రామ కార్యదర్శులు మండల కమిటీ సభ్యులు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love